AP లో చదువుతున్న పిల్లల శారీరక ఆరోగ్యం కోసం గోరుముద్ద పథకం.
ఏపీలో చదువుతున్న చిన్నారుల శారీరక ఆరోగ్యం కోసం నేటి నుంచి గోరుముద్ద పథకాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు రాగి జావను అందజేస్తామని సీఎం వివరించారు. ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రంలోని విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇందుకోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు
విద్యాదీవెనతో పాటు విద్యార్థులకు వసతి దీవెన పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారంగా రాగి జావను చేర్చినట్లు వివరించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావను అందిస్తామని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News State News
AP లో చదువుతున్న పిల్లల శారీరక ఆరోగ్యం... [21 03 2023 12:44 pm]
bottom
rightpane