‘‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’’ కార్టూన్‌ను ఎక్స్‌లో పోస్టు చేసిన పవన్
|
‘‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’’ కార్టూన్‌ను ఎక్స్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు. ఏపీలో అధ్వానంగా ఉన్న రోడ్లపై తెలుగుదేశం - జనసేన పార్టీలు రెండు కలిసి 'గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది' పేరుతో 18, 19 వ తేదీల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఓ కార్టూన్‌ను పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. బస్సు, ఇతర వాహనదారులు గుంతల్లో పడి పైకి ఎగురుతున్నట్లుగా వ్యంగ్యంగా ఈ చిత్రం ఉంది. జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలారా గుంతల రోడ్లతో ఎన్నాళ్లు మనకు ఈ పాట్లు అని ఎక్స్‌లో పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|