ముఖ్యమంత్రి సభ!
|
జగన్మోహన్‌రెడ్డి బుధవారం కొవ్వూరులో నిర్వహించిన బహిరంగ సభ నుంచి జనం పరుగులు తీశారు. ‘ఉండలేం.. వినలేం.. బయటకు వెళ్లిపోతాం.. ప్లీజ్ వదిలేయండి బాబూ.. మీకు పుణ్యం ఉంటుంది..’ అని పోలీసులను వేడుకున్నా లాభం లేకపోవడంతో బారికేడ్లు దూకి మరీ వెళ్లిపోయారు.
ఇక భరించలేక ఒకరి వెంట ఒకరు బయటకు క్యూ కట్టారు. సీఎం మాట్లాడుతుండగానే జనం ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోయారు. 2.1 కి.మీ. రోడ్‌షోకు ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా రోప్‌తో పోలీసు సిబ్బంది అటూఇటూ కాపలా ఉండగా సీఎం రోడ్‌షో నిర్వహించారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో కొవ్వూరు రోడ్ కమ్ రైలు బ్రిడ్జి, ధవళేశ్వరం బ్యారేజ్‌పై ఆంక్షలు పెట్టి, మొత్తం ట్రాఫిక్‌ను గామన్ బ్రిడ్జి మీదుగా మళ్లించారు. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. బుధవారం నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కావడంతో సప్లిమెంటరీ, బెటర్‌మెంట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు రాజమహేంద్రవరం వెళ్లడానికి ఇబ్బందిపడ్డారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|