మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఫై సీఎం ప్రశంసలు
|
జగన్ ప్రసంసలు. దేశ, విదేశీ కార్పోరేట్ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన విశాఖ ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023’ భారీ సక్సెస్ కావడం తో వైస్సార్సీపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ ..మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్ లపై ప్రశంసలు కురిపించారు. విశాఖ లో మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్ లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు, 378 ఒప్పందాలు కుదిరాయి. దీంతో 6.09 లక్షల మందికి ఉపాధి లభించబోతుంది.ఈ సందర్బంగా జగన్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ లను ప్రశంసించారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|