షాకింగ్.. శనివారం తిరుమలలో ఇదేమి విచిత్రం?
|
షాకింగ్.. శనివారం తిరుమలలో ఇదేమి విచిత్రం? వీకెండ్ వచ్చిందంటే చాలు తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. కానీ విచిత్రం ఈ శనివారం రోజున మాత్రం భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో తగ్గింది. స్వామివారి దర్శనం కోసం కేవలం ఒక కంపార్ట్‌మెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి నేరుగా అనుమతిస్తున్నారు. శుక్రవారం 62357 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ జరగనుంది. రేపు సాయంత్రం మాడ వీధుల్లో స్వామివారు విహరించనున్నారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|