అన్నవరం ఆలయ సంప్రదాయాలకు కొత్త నిబంధనలు
|
కాకినాడః అన్నవరం సత్యదేవుని దర్శించుకునే భక్తులకు ఆలయ అధికారులు డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు. నిజానికి ఆలయంలో మూడేళ్ల క్రితమే డ్రెస్‌కోడ్ అమల్లోకి తెచ్చినప్పటికీ అధికారులు దానిని పక్కనపడేశారు. తాజాగా నిన్నటి నుంచి దీనిని మళ్లీ అమల్లోకి తెచ్చారు.సత్యదేవుని వ్రతం, నిత్య కల్యాణం, ఇతర పూజలకు భక్తులు సంప్రదాయ వస్త్రధారణలోనే పాల్గొనాలని అధికారులు పేర్కొన్నారు. పురుషులైతే పంచె, కండువా లేదంటే కుర్తా పైజమా, మహిళలైతే చీర, కుర్తా పైజమా ధరించాలని అధికారులు పేర్కొన్నారు. డ్రెస్ కోడ్‌పై భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|