నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పైకిలేపినందుకు వాళ్ళకి పాదాభివందనాలు.
|
జూనియర్ ఎన్టీఆర్ దుబాయిలో ఒక సినిమా వేడుకలో పాల్గొనేందుకు కుటుంబంతో వెళ్ళాడు. అక్కడ నిన్న రాత్రి 'ఆర్ఆర్ఆర్' లో తను చేసిన పాత్రకి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ వున్నాయి.
తెలుగువాళ్లందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలమీదే వుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ) అరెస్టు, ఆ తరువాత అతని అరెస్టును చలన చిత్ర పరిశ్రమ నుండి ఎక్కువమంది ముందుకు వచ్చి ఖండించలేదని విమర్శలు, వార్తలు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే వున్నాయి. నిర్మాత నట్టికుమార్ చలన చిత్ర పరిశ్రమ నుండి అందరూ ఈ అరెస్టును ఖండించాలని చెప్పాడు. అయితే ఇవన్నీ ఆలా ఉంచితే కుటుంబ సభ్యుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ ఈ అరెస్టు గురించి ఎటువంటి వ్యాఖ్య చేయకపోవటం ఇంకో చర్చనీయాంశం అయింది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|