చిరు ఇంట మెగా సందడి... సల్మాన్‌ విషెస్‌!
మెగా కాంపౌండ్‌లో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ రోజులు చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్‌’(god father) చిత్రం విడుదల కావడం, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకోవడంతో ఈ పండుగ చిరు ఇంట మరింత ప్రత్యేకత సంతరించుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో చిరంజీవి – సురేఖ దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి, రామ్‌చరణ్‌(Ram charan), ఉపాసన, సుస్మిత, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. రామ్‌చరణ్‌, ఉపాసన అంజనా దేవితో ఆప్యాయంగా దిగిన ఫొటోలను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 
అలాగే ‘గాడ్‌ఫాదర్‌’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ బుధవారం సాయంత్రం చిరు ఇంట నిర్వహించారు చిత్ర నిర్మాతలు.  దర్శకుడు మోహన్‌రాజా, నిర్మాతలు ఆర్‌.బి.చౌదరి, ఎన్వీప్రసాద్‌, సత్యదేవ్‌, తమన్‌.. చిరంజీవికి పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. మైత్రిమూవీ మేకర్స్‌ నిర్మాతలు, హరీశ్‌ శంకర్‌, మెహర్‌ రమేశ్‌ కూడా చిరు ఇంట జరిగిన సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు.
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News State News
సరదా ముచ్చట్లు - చమత్కారాలు (unstoppable) [15 Oct 2222 11:10 am]
చిరు ఇంట మెగా సందడి... సల్మాన్‌ విషెస్‌! [07 Oct 2222 12:10 pm]
సీతారామం సీక్వెల్........దుల్కర్ సల్మాన్ ఏం అన్నారంటే? [29 Sep 2222 11:09 am]
andhra cinema [21 Feb 2020 10:02 am]
this is test for timestamp [21 Feb 2020 10:02 am]
bottom
rightpane