పశుగ్రాసం కొరత
|
పాడి పశువులకు గ్రాసం కరువవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత పాడి పశువుల పెంపకానికి రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఏడాది జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చాలా మంది కూలీలు వలసబాట పట్టారు. ఆవులు, గేదెలు ఉన్న రైతులు స్థానికంగానే ఉంటున్నారు. అన్నదాతలు సాగు చేసిన పం టలు పూర్తిగా ఎండిపోవడంతో పశువులకు మేత దక్కని పరిస్థితి నెలకొంది. దీంతో పశుగ్రాసం ధర పెరిగింది. ఒక్క ట్రాక్టర్ గడ్డిలోడు రూ.5 వేలు పలుకుతోంది. ట్రాక్టర్‌తో ఆ గడ్డిని తరలించేందుకు బాడుగ, కూలీల ఖర్చులు మరో రూ.6 వేలకు పైగా ఖర్చవుతోంది. దీంతో పాడి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇతర గ్రామాల్లో వరిగడ్డి కొనే స్థోమత లేక కొందరు మూగజీవాలను విక్రయిస్తు న్నారు. మూగ జీవాలను వదులుకోలేని రైతులు పశుగ్రాసం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పంటల పెట్టు బడికి అప్పులపాలైనా.. పశువుల కోసం మళ్లీ అప్పు చేయా ల్సిన పరిస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|