ఎన్టీఆర్ ను అవమానిస్తే కోట్ల మందిని అవమానించినట్లే....
|
ఒక సంస్థకు ఒక ప్రభుత్వం ఒక పెద్ద మనిషి పేరు పెట్టాక దాన్ని కాదని మరొక ప్రభుత్వం ఆ పేరు తొలగిస్తే ఆయనను అవమానించినట్లే అవుతుంది. అంతేకాదు... ఆయనను అభుమానించర్ కోట్ల మంది ప్రజలను అవమానించినట్లే అని ఏపి లోని ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఉద్దేశించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
ఇలా సంస్థల పేర్లను తొలగించడం సరైన చర్య కాదన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాటాడుతూ మా నాన్న నన్ను ప్రేమించినంతగా ఎవరినీ ప్రేమించలేదు,ఆయనను నేను ఆరాధించినంతగా ఎవరూ ఆరాధించలేదు. సంస్థల పేర్ల మార్పిడి విషయానికొస్తే....ఆ సంస్థకు ఈ రోజు వైఎస్సార్ పేరు పెట్టారు రేపు వచ్చే ప్రభుత్వం ఆ పేరు తొలగించి మరొక పేరు పెడిటె వైఎస్సార్ కు అవమానం కలిగినట్లు కాదా. అసలు ఒకరి ఖ్యాతిని తీసుకొని వైఎస్సార్ కు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకున్న పేరు చరిత్రలో మరెవరికీ లేదు. ఆయన చనిపొతే ఆ బాధ తట్టుకోలేక 700 మంది గుండెలు ఆగిపోయాయి అని పేర్కొనారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|