అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు పొటెత్తిన భక్తులు.. రెండు నెలలపాటు..
|
కేరళలోని శబరిమలకు భక్తులు పోటెత్తారు. అయ్యప్పస్వామి దర్శనాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభం కావడంతో భక్తులు ఆలయానికి క్యూకట్టారు. పవిత్రమైన మలయాళ మాసం వృచికం మొదటి రోజు అయిన శక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు పుజారులు ఆలయ తెలుపులు తెరిచారు. శుక్రవారం నుంచి రెండు నెలలపాటు దర్శనాలు కొనసాగనున్నాయి. దీంతో అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది యాత్రికులు, భక్తులు శబరికి తరలివస్తున్నారు. ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రతి ఏడాది దక్షిణ భారతదేశం నుంచి వచ్చే భక్తులతోనే శబరిమల యాత్ర ప్రారంభమవుతుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు శబరికి క్యూ కట్టారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|