రజినీకాంత్ తో రావు రమేష్
|
తెలుగులో వున్న అతికొద్దిమంది క్యారెక్టర్ నటుల్లో వైవిధ్యంగా నటించే నటుడు రావు రమేష్. అతనికి ఇప్పుడు ఒక పెద్ద ఛాన్స్ వచ్చిందని, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారని తాజా భోగట్టా సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు వరస సినిమాలతో బిజీగా వున్నారు. 'లాల్ సలాం' #LalSalaam సినిమా షూటింగ్ పూర్తి అయిపొయింది, దీనికి అతని కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమా తరువాత 'తలైవా 170' #Thalaivar170 కూడా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకి టిజె జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. అతను ఇంతకు ముందు 'జై భీం' #JaiBhim అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. రజినీకాంత్, అమితాబ్ కాంబినేషన్ సన్నివేశాల షూటింగ్ కూడా కొంత అయిందని కూడా తెలిసిన విషయమే
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|