ఆర్టీసీలో తొలిసారిగా యూపీఐ చెల్లింపులకు శ్రీకారం
|
రాష్ట్రంలో తొలిసారిగా వాయువ్య కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో యూపీఐ(UPI) చెల్లింపుల ద్వారా టికెట్‌లు కొనుగోలు చేసే విధానం తీసుకురాదలచినట్లు మేనేజింగ్ డైరెక్టర్ భరత్ తెలిపారు. గురువారం హుబ్బళ్ళిలో మీడియాతో మాట్లాడుతూ హుబ్బళ్ళి గ్రామీణ విభాగం 3వ డిపో పరిధిలో యూపీఐ చెల్లింపుల ద్వారా ప్రయాణాల విధానం ఇటీవల ప్రవేశపెట్టామన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిన మేరకు వాయువ్య కర్ణాటక రీజియన్‌లో పూర్తిగా యూపీఐ చెల్లింపులను అమలులోకి తీసుకురాదలచామన్నారు. ప్రజారవాణా మరింత వెసలుబాటు తీసుకురావాలనే సేవలు తీసుకురాదలచామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలను పెంచుతున్న తరుణంలో రాష్ట్రంలోని నాలుగు ఆర్టీసీ కార్పొరేషన్‌లలో తొలిసారిగా వాయువ్య రీజియన్‌లో యూపీఐ చెల్లింపుల ప్రక్రియ తీసుకురాదలచినట్లు తెలిపారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|