కారు విక్రయాల్లో భారత్ దూకుడు.....
|
చిప్ కొరత తీరుతున్నందున, ప్రస్తుత పండగ సీజనులో భారత వాహన పరిశ్రమ తన ప్రాంతీయ, అంతర్జాతీయ పోటీదార్ల కంటే మెరుగ్గా కార్ల విక్రయాలను సాధించొచ్చని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ పేర్కొంది."కార్ల అమ్మకాల్లో ఈ ఏడాదిలో భారత్ వెలిగిపోతుంది.
స్ధూల ఆర్ధిక వాతావరణం బలంగా ఉండడం, సెమీకండక్టర్ కొరత తీరుతుండడంతో ఇది సాధ్యం కావొచ్చని పేర్కొంది. ప్రపంచంలో అతి పెద్ద వాహన మార్కెట్ అయిన చైనాలో ఈ ఏడాది వాహన అమ్మకాలు 4% మాత్రమే పెరగచ్చు. 2023లో 3.5 శాతం వృద్ధి కనిపించొచ్చు. 2023కల్లా చైనా, భారత్ లలో వాహన అమ్మకాలు 2018 నాటి స్థాయికి చేరొచ్చు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|