బొబ్బిలి- సాలూరు రైల్వే లైను ఓకే.
|
బొబ్బిలి-సాలూరు రైల్వేలైను రైళ్ల రాకపోకలకు అనుకూలంగా ఉందని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజరు సౌరభ్‌ప్రసాద్ సంతృప్తి వ్యక్తం చేశారు. విజయనగరం-బొబ్బిలి-సాలూరు రైల్వే లైనును ఆయన మంగళవారం పరిశీలించారు.ఈ లైనులో విండో ట్రైలింగ్ ద్వారా తనిఖీ చేశారు. బొబ్బిలి నుంచి సాలూరు రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడ ప్రయాణికులు, గ్రామస్తులతో మాట్లాడారు. బొబ్బిలి-సాలూరు పట్టణాలకు మధ్య రైలు బస్సు నడిచినప్పుడు ఉండే మౌలిక సదుపాయాలను బేరీజు వేశారు. అనంతరం బొబ్బిలి రైల్వేస్టేషన్‌కు వచ్చి ఇక్కడున్న వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. అమృత భారత్ పథకంలో ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నందున ఇందుకు సంబంధించి రైల్వే అధికారులతో చర్చించారు. అనంతరం పార్వతీపురం రైల్వే స్టేషన్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట సీనియన్ డివిజనల్ ఇంజనీర్ ఏకే మొహరానా, సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజరు జి.సునీల్‌కుమార్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజరు ఏకే త్రిపాఠి, ఎలక్ర్టికల్ ఇంజనీరు శివ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|