|
అయ్యప్పస్వామి గ్రామోత్సవం
|
పట్టణంలోని గాంఽధీనగర్‌లో నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం అయ్యప్ప స్వామికి విళక్కు పూజా కార్యక్రమం అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం పట్టణంలోని ప్రధాన వీధులగుండా అయ్యప్ప స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. కేరళ ప్రత్యేక వాయిద్య బృందంతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
రుద్రవరం సమీపంలోని దొర్వి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కొలనులో సూర్యోదయాన అయ్యప్పస్వామి విగ్రహానికి బుధవారం చక్రస్నానం నిర్వహించారు. అనంతరం అభిషేకం చేశారు. అయ్యప్పస్వామి ఉత్తరాయన పూజలు ఘనంగా నిర్వహించారు. మేళతాళాలతో పురవీధుల గుండా అయ్యప్పస్వామి విగ్రహం మోసుకుంటూ రథంలో మరోవిగ్రహం ఏర్పాటు చేసి గ్రామోత్సవం చేశారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|