|
ఓం నమఃశివాయ
|
కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా జిల్లాలో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. అంతటా శిమనామస్మరణ మార్మోగింది. వేకువ జామునే శివాలయాలకు చేరుకున్న భక్తజనం క్యూలైన్లలో గంటల కొద్దీ నిరీక్షించారు. అనంతరం శివయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం వేళల్లో మహిళలు ఆలయాల వద్ద దీపారాధన చేశారు. మొత్తంగా అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. జిల్లాలో పార్వతీపురం మండలంలోని పిట్టలవలస, శివాలయం, అడ్డాపుశీల కాశీవిశ్వేశ్వరాలయాలకు భక్తులు పోటెత్తారు. దేవదాయశాఖ , కమిటీల ఆధ్వర్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. పాలకొండలోని సదాశివుని ఆలయం, ఉమా రామలింగేశ్వరస్వామి, భీమలింగేశ్వరస్వామి, శివాలయంలో విశేష పూజలు చేశారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|