|
అయోధ్యకు కాణిపాకం బావి తీర్థం, అక్షితలు
|
శ్రీరాముడు తిరిగాడిన నేల అయోధ్యకు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కాణిపాకం నుంచి స్వామి బావి తీర్థం, అక్షితలను ఆలయ అధికారులు పంపారు. మంగళవారం అయోధ్య రామ మందిర ప్రచార రథం కాణిపాకం విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రథాన్ని కాణిపాకం మాడవీధులలో అంగరంగ వైభవంగా ఊరేగించి ఆలయం వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార రథంలో విచ్చేసిన అధికారులకు వరసిద్ధుడి దర్శన భాగ్యం కల్పించి, తీర్థప్రసాదాలు అందించారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగనున్నందున ప్రచార రథం కాణిపాకం విచ్చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేశు, ఏఈవో ఎస్వీ.కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్ రమేష్, అయోధ్య మందిర అధికారులు తిలక్‌ద్వివేజి, వైష్ణవిదాస్, రాఘవేంద్రదా్‌సజీ, రాంజీపాండే, విశ్వహిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|