|
ఆదిత్యా.. అనుగ్రహించయ్యా!
|
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. ప్రత్యక్షదేవం.. అరసవల్లి ఆదిత్యుడి ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కరువవుతున్నాయి. ఆరోగ్యప్రదాతగా కొలిచే శ్రీసూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు రోజూ వేలసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
ప్రతీ ఆదివారంతో పాటు కార్తీకమాసం, మాఘమాసం, వైశాఖమాసం, రథసప్తమి వంటి పర్వదినాల్లో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో టిక్కెట్లు, ప్రసాదాల విక్రయాలతోపాటు విరాళాల రూపంలో ఆదిత్యుడికి ఆదాయం పెరుగుతోంది. కానీ భక్తులకు మాత్రం వసతులు కల్పించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది భక్తులు ఆదిత్యుడి అన్నప్రసాదం స్వీకరించాలని భావిస్తుంటారు. ప్రత్యేక పర్వదినాల్లో సుమారు 1,500 మంది వరకు భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. కాగా అన్నదాన కేంద్రంలో ఒకేసారి కనీసం 200 మంది కూడా కూర్చొనే సామర్థ్యం లేదు. దీంతో భక్తులు గంటల తరబడి నిరీక్షించి ఇబ్బందులు పడుతున్నారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|