|
వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
|
మండలంలోని సుంకిశాల గ్రామంలోని వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రుత్వికుల వేద మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ శుక్రవారం పుణ్యాహవాచనంతో ఆరంభమయ్యాయి. దేవతల సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడికి తొలి పూజతో వేంకటేశ్వరుడి ఉత్సవాలకు శాస్త్రోకతంగా శ్రీకారం చుట్టారు. ఆలయంలో పట్టు వస్త్రాలు, బంగారు ముత్యాల ఆభరణాలతో అలంకరించిన స్వామివారిని ప్రత్యేక పీఠంపై అధిష్ఠింపజేశారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగేందుకు విశ్వక్సేనుడికి తొలి పూజ చేశారు. ఆలయ పరిసరాలను శుద్ధి చేసేందుకు పుణ్యహవాచనం నిర్వహించారు. ఉత్సవమూర్తుల ఎదుట పంచామృత కలశాలకు దర్ఫాలతో వేద మంత్రోచ్ఛరణల నడుమ పూజలు నిర్వహించారు. ఆ జలాలతో స్వామివారికి నిజాభిషేకం నిర్వహించి ఆలయ పరిసరాల్లో చిలకరించారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|