ఎన్నికల వేళ తెరపైకి విశాఖ మెట్రో.
|
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ‘మమ’ అనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే దీనికి శ్రీకారం చుట్టగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక సమీక్షించి మళ్లీ మొదటికి తీసుకువచ్చింది. ‘ముఖ్యమంత్రి జగన్ ఆలోచన...లైట్ రైలు’ అంటూ కొత్త ప్రతిపాదనలు రూపొందించారు. అమరావతిలో ఉన్న ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ కార్యాలయాన్ని విశాఖపట్నానికి తీసుకువచ్చారు. మూడేళ్ల క్రితం (26 అక్టోబరు, 2020) దసరా రోజున మంత్రి బొత్స సత్యనారాయణ ఎల్‌ఐసీ భవనంలో కొత్త కార్యాలయం ప్రారంభించారు. 2021 మార్చి నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|