పీఆర్–126 పైనే రైతుల మక్కువ!
|
అధిక దిగుబడి ఇచ్చే పీఆర్– 126 రకానికి రైతులు మక్కువ చూపుతుంటే.. అఽధికారులు మాత్రం దీనిని సాగు చేయవద్దని స్పష్టం చేస్తున్నారు.అయితే అధిక దిగుబడితోపాటు ఆదాయాన్ని తీసుకువచ్చే ఈ రకాన్నే దాళ్వాలో సాగు చేయాలనే ఆలోచనలో రైతులు ఉన్నట్లు కనిపిస్తోంది. తక్కువ నీటి వాడకంతో అధిక దిగుబడి ఇచ్చే రకం పీఆర్–126. ఈ రకాన్ని పంజాబ్ వ్యవసాయ పరిశోధన శాఖ, అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిఫిన్స్ సంయు క్తంగా రూపొందించింది. పంజాబ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లోని రైతులు ఆరేళ్లుగా ఏ–గ్రేడ్ రకంగా దీనిని సాగు చేసి ఆశా జనకమైన ఫలితాలను పొందుతున్నారు. 2016లో ఈ వరి వంగడం పంజాబ్ రకంగా మార్కెట్‌కు విడుదల చేశారు. గింజ నాణ్యత బాగుండి, చేను పడిపోకుండా ఉల్లి కోడు, ఎండాకు తెగులు, చీడ పీడలు రాని బరువు కలిగిన ధాన్యంగా ప్రాచుర్యం పొందింది. గత దాళ్వాల్లో తెలంగాణలో వడగళ్ళ వానను తట్టుకుని ఐకేపీ కేంద్రాల్లో ఏ–గ్రేడు ధాన్యంగా ఈ వరి వంగడాన్ని కొనుగోలు చేశారు. గత ఏడాది పీఆర్–126 రకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో 22 శాతం సాగు చేశారు. ఈ ఏడాది దాళ్వాలో సుమారు లక్ష ఎకరాలు సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ఎకరానికి 40 నుంచి 60 బస్తాల దిగుబడితో 22 వేలకుపైగా అదనపు లాభాన్ని పొందారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|