అబుదాబీ టీ 10 లీగ్-2022 లో టీమ్ ఇండెయా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేష్ రైనా భాగం కానున్నారు. ఈ లీగ్ లో ఢిల్లీ బుల్స్ తో హర్భజన్ సింగ్ ఒప్పందం కుదుర్చుకోగా.... డిఫెండింగ్ చాంపియన్ డెక్కన్ గ్లాడియేటర్స్ కు రైనా ప్రాతినిధ్యం వహించనున్నారు.డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టుకు వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో సారధ్యం వహించనున్నారు.
అబుదాబి టీ 10 లీగ్ నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. సురేష్ రైనా ప్రస్తుతం రోడ్ సెఫ్టీ లీగ్ లో ఇండియా లెజెండ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. అదే విధంగా హర్భజన్ సింగ్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో మణిపాల్ టైగర్స్ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు.